Surrogacy leaves: సరోగసీ తల్లులకు ఆరు నెలల ప్రసూతి సెలవు

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సరోగసీ (అద్దెగర్భం) విధానంలో సంతానం పొందినట్లైతే ఇకపై 180 రోజుల సెలవు తీసుకోవచ్చు. ఈ మేరకు 50 సంవత్సరాల కిందట ప్రకటించిన సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(లీవ్‌) రూల్స్‌(1972)కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది.

Published : 25 Jun 2024 06:46 IST

దిల్లీ: ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సరోగసీ (అద్దెగర్భం) విధానంలో సంతానం పొందినట్లైతే ఇకపై 180 రోజుల సెలవు తీసుకోవచ్చు. ఈ మేరకు 50 సంవత్సరాల కిందట ప్రకటించిన సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(లీవ్‌) రూల్స్‌(1972)కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసీ విధానంలో సంతానాన్ని పొందితే వారు 180 రోజుల మాతృత్వ సెలవులు పొందొచ్చు. ఒకవేళ గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకూ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇద్దరు సంతానం వరకే వీటిని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్‌ ఫాదర్‌ కూడా మొదటి ఆరు నెలల్లోగా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు పొందడానికి కేంద్రం వీలు కల్పించింది. ఈ విధానం ద్వారా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగినికి ఇంతకాలం ఈ సదుపాయం అందుబాటులో లేదు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని