Published : 09/02/2021 16:28 IST

ఉత్తరాఖండ్‌లో నిరంతర పర్యవేక్షణ: అమిత్‌షా

దిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగా నది వరద విపత్తు ప్రాంతాల్లోని పరిస్థితుల్ని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. ఈ మేరకు విపత్తు ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి అమిత్‌షా మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీలో మంచుచరియలు కూలడంతో ధౌలిగంగా నది ఉప్పొంగిన విషయం తెలిసిందే. 

‘ఉత్తరాఖండ్‌లోని విపత్తు ప్రాంతాల్లో కేంద్రం, రాష్ట్రానికి చెందిన అన్ని సహాయక బృందాలు ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. విపత్తు ప్రభావిత 13 గ్రామాల్లో వైద్యం, ఆహార పంపణీ సహా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.  ఐటీబీపీ జవాన్లు 450 మంది, ఐదు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 8 ఇండియన్‌ ఆర్మీ బృందాలు, నేవీ బృందం, భారత వైమానిక దళానికి చెందిన ఐదు హెలికాప్టర్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి’ అని షా తెలిపారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్‌కు విపత్తు ప్రతిస్పందన నిర్వహణ కోసం 2020-21 బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో తొలి విడతగా రూ.468కోట్లు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు. 

‘విపత్తు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలు, పునరావాస పనుల్ని వేగవంతంగా చేపడుతున్నాం. ఈ విపత్తు కారణంగా ధౌలిగంగా నదిపై నిర్మాణంలో ఉన్న ఎన్టీపీసీ హైడ్రో ప్రాజెక్టు టన్నెల్‌ నుంచి 12మంది, రిషి గంగా ప్రాజెక్టు సమీపంలోని టన్నెల్‌ నుంచి 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో ఎన్టీపీసీ ప్రాజెక్టు టన్నెల్‌లో ఇంకా 25 నుంచి 35 మంది చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు. నీటి ఉద్ధృతి తగ్గింది’అని షా తెలిపారు. రాజ్యసభలో అమిత్‌షా ప్రసంగం తర్వాత సభ్యులంతా కొద్దిసేపు మౌనం పాటించి ఉత్తరాఖండ్‌ బాధితులకు నివాళి అర్పించారు. 

మరోవైపు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మంగళవారం విపత్తు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. కాగా ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో ధౌలిగంగా నది విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 31కి చేరినట్లు సీఎం తెలిపారు. 

ఇదీ చదవండి

ఆజాద్‌కు వీడ్కోలు.. మోదీ కన్నీళ్లు

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని