రూ.1.23 లక్షల కోట్లు విలువైన ధాన్యం సేకరణ
ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో కేంద్రం 651.07 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించింది. దీని విలువ దాదాపు రూ.1.23 లక్షల కోట్లు ఉంటుందని కేంద్ర ఆహార శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా 93.93 శాతం మంది రైతులు లబ్ధి పొందినట్లు తెలిపింది.........
దిల్లీ: ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో కేంద్రం 651.07 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించింది. దీని విలువ దాదాపు రూ.1.23 లక్షల కోట్లు ఉంటుందని కేంద్ర ఆహార శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా 93.93 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొంది. ఓవైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపడుతుండగా.. ఈ ధాన్యానంతా కనీస మద్దతు ధరకే(ఎంఎస్‌పీ) కొనుగోలు చేయడం గమనార్హం. రాబోయే సీజన్లోనూ ఎంఎస్‌పీకే ధాన్యాన్ని సేకరిస్తామని కేంద్ర ఈ సందర్భంగా హామీ ఇచ్చింది. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ఈసారి 15.91 శాతం అధికంగా ధాన్యం సేకరించినట్లు పేర్కొంది. మరోవైపు 651.07 లక్షల మెట్రిక్ టన్నుల్లో 202.82 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 31.15 శాతం ధాన్యం ఒక్క పంజాబ్ నుంచే వచ్చినట్లు తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి
-
Sports News
Gambhir: మాజీ ఆటగాళ్లకు మసాలా అవసరం.. కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్
-
India News
Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్‌కు కాల్స్..!
-
India News
CUET-PG 2023: సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ ఇదే.. UGC ఛైర్మన్ ట్వీట్!