Nagaland: మరో 6 నెలల పాటు కల్లోల ప్రాంతమే..!

నాగాలాండ్‌ను కల్లోల ప్రాంతంగా పేర్కొంటూ రాష్ట్రంలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం అమలును మరో ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

Updated : 12 Sep 2022 11:14 IST

దిల్లీ: నాగాలాండ్‌ను కల్లోల ప్రాంతంగా పేర్కొంటూ రాష్ట్రంలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం అమలును మరో ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం కింద ఈ నెల 30 నుంచి డిసెంబరు 31 వరకు అక్కడ ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో భేటీ అయిన 24 గంటల్లోనే ఈ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలకు సంబంధించిన కేసులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ముందస్తు వారంట్ లేకుండానే రాష్ట్రంలో ఎక్కడైనా గాలింపు చర్యలు చేపట్టడం సహా ఎవరినైనా అరెస్టు చేయడానికి భద్రతా బలగాలకు సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం అధికారం కల్పిస్తుంది. 

నాగాలాండ్‌లో దశాబ్దాలుగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం అమల్లో ఉంది. అక్కడి నుంచి కేంద్ర బలగాలను వెనక్కు తీసుకునే అంశంపై  ఒప్పందం కుదిరింది. సుమారు 18 ఏళ్ల పాటు.. 80 సార్లు చర్చలు కొనసాగిన అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. నాగా తిరుగుబాటుదారులు, ప్రభుత్వం మధ్య తొలిసారిగా 1997లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని