Covid Guidelines: కరోనా మార్గదర్శకాలను పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో.........

Published : 28 Jul 2021 22:06 IST

దిల్లీ: దేశంలో కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అశ్రద్ధకు తావులేకుండా అందరూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు.

రానున్న పండుగల నేపథ్యంలో ప్రజలు గుమిగూడే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘క్రియాశీల కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. కొవిడ్‌ కేసుల సంఖ్య క్షీణించడం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. కొత్త కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్న విషయాన్ని గుర్తించాలి. అందుకే అశ్రద్ధ వహించొద్దు’ అని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపించారు. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన నిబంధనలు విధించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో వైరస్‌ను కట్టడిచేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని అజయ్‌ భల్లా సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని