Agnipath: అగ్నివీరుల రిటైర్మెంట్‌ వయస్సు 65 ఏళ్లకు పెంచండి: దీదీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకం (Agnipath Scheme) కింద నియామకమయ్యే సైనికుల సర్వీసు నాలుగేళ్లయితే ఆ తర్వాత వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)......

Updated : 27 Jun 2022 18:21 IST

బుర్ద్వాన్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకం (Agnipath Scheme) కింద నియామకమయ్యే సైనికుల సర్వీసు నాలుగేళ్లయితే ఆ తర్వాత వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆందోళన వ్యక్తంచేశారు. ఆ సైనికుల రిటైర్మెంట్‌ వయస్సును (Retirement age) 65ఏళ్లకు పెంచాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌ను తీసుకొచ్చిందని దీదీ ఆరోపించారు. భాజపాలా కాకుండా మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించడమే తన నినాదమని తెలిపారు. సోమవారం బుర్ద్వాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన దీదీ.. కేంద్రం నాలుగు మాసాలు శిక్షణ ఇచ్చి.. నాలుగేళ్ల పాటు ఉద్యోగానికి తీసుకుంటే మరి ఆ తర్వాత సైనికులంతా ఏం చేయాలని ప్రశ్నించారు. వారి భవిష్యత్తు మాటేంటని ప్రశ్నించారు. నాలుగేళ్లకే సర్వీసు పూర్తయి బయటకు వచ్చాక వారి భవిష్యత్తులో అనిశ్చితి నెలకొంటుందన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకంలో భాగంగా నియమించుకొనే అగ్నివీరుల ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని