Corbevax: ప్రికాషనరీ డోసుగా కార్బివాక్స్‌..? 5 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్‌..!

కరోనా మహమ్మారిని అడ్డుకునే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ప్రికాషనరీ డోసు

Published : 06 Feb 2022 02:17 IST

దిల్లీ: కరోనా మహమ్మారిని అడ్డుకునే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ప్రికాషనరీ డోసు పంపిణీని విస్తరించాలని భావిస్తోంది. ఇందుకోసం మరిన్ని డోసుల కొనుగోలును ముమ్మరం చేసింది. ఈ ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ - ఇ అభివృద్ధి చేసిన కార్బివాక్స్‌ టీకా 5 కోట్ల డోసుల కోసం ఆ సంస్థకు కేంద్రం ఆర్డర్‌ పెట్టినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. ఒక్కో డోసును రూ. 145(జీఎస్‌టీ అదనం) చొప్పు వీటిని కొనుగోలు చేయనుంది. ఈ డోసులను ఫిబ్రవరి చివర నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ టీకాను ఎవరికి అందిస్తారన్న దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రికాషనరీ డోసుగా దీన్ని పంపిణీ చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, 60ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రికాషనరీ డోసును పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో 60ఏళ్ల లోపు వారికి కూడా మూడో డోసు పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తోంది. వీరికి ప్రికాషనరీ డోసుగా కార్బివాక్స్‌ను ఇచ్చే అవకాశాలున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. 

ఆర్‌బీడీ ప్రొటీన్‌ ఆధారిత తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ అయిన కార్బివాక్స్‌ అత్యవసర వినియోగానికి ఇటీవల కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ టీకాకు అనుమతులు రాకముందే 30 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం.. బయోలాజికల్‌ - ఇ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 1500కోట్లు చెల్లించింది కూడా. ఈ ఒప్పందంలో భాగంగానే డోసుల కొనుగోలుకు తాజాగా ఆర్దర్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని