Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

రెండేళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత పర్యటనకు వచ్చారు. 36 గంటల పాటు మన దేశంలో పర్యటించారు.

Published : 19 Aug 2022 01:53 IST

దిల్లీ: రెండేళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత పర్యటనకు వచ్చారు. 36 గంటల పాటు మన దేశంలో పర్యటించారు. మరి ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం కేంద్రానికి అయిన ఖర్చెంతో తెలుసా? ట్రంప్‌ పర్యటన నిమిత్తం దాదాపు రూ.38లక్షలు ఖర్చు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కేంద్ర సమాచార కమిషన్‌కు (సీఐసీ) తెలిపింది.

ట్రంప్‌ పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చెంతో తెలపాలంటూ మిషల్‌ భతేనా 2020 అక్టోబరులో సహచట్టం ద్వారా విదేశాంగ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఆహారం, భద్రత, విమానాలు, ఇతర సదుపాయాల కోసం ఎంత వెచ్చించిందో చెప్పాలని కోరారు. అయితే, ఈ దరఖాస్తుకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో భతేనా.. సీఐసీని ఆశ్రయించారు. సమాచార కమిషన్‌ ఆదేశాలతో విదేశాంగ శాఖ ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన సమాధానమిచ్చింది. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా జవాబిచ్చేందుకు ఆలస్యమైందని తెలిపింది. ట్రంప్‌నకు నివాసం, భోజనం, విమాన ప్రయాణాలు అన్నీ కలిపి దాదాపు రూ.38లక్షలు ఖర్చయినట్లు తెలిపింది.

2020 ఫిబ్రవరి 24-25న ట్రంప్‌ తన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్‌ కుష్నర్‌ భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో మూడు గంటల పాటు పర్యటించారు. ప్రధాని మోదీతో కలిసి 22కిలోమీటర్ల రోడ్‌షోలో పాల్గొన్నారు. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించి.. మోతెరా మైదానంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అదే రోజు ఆగ్రా వెళ్లి చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఫిబ్రవరి 25న దిల్లీ చేరుకుని ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దాదాపు 36 గంటల పాటు ట్రంప్‌ భారత్‌లో పర్యటించారు

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని