అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్రం పునరాలోచన.. సమీక్షించాకే నిర్ణయం!

అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం పునరాలోచనలో పడింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో పరిస్థితి సమీక్షించాకే ప్రయాణాలను పునరుద్ధరించనుంది.

Published : 28 Nov 2021 18:54 IST

దిల్లీ: అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం పునరాలోచనలో పడింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో పరిస్థితి సమీక్షించాకే ప్రయాణాలను పునరుద్ధరించనుంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్‌ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే, కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాల నేపథ్యంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షించాకే సర్వీసుల పునరుద్ధరణ తేదీలపై నిర్ణయం తీసుకుంటామని హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ముఖ్యంగా రిస్క్‌ జాబితాలో దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అనుసరించాల్సిన టెస్టింగ్‌, నిఘాను కూడా సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఈ భేటీలో నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌, ప్రధాని ముఖ్య సలహాదారు డాక్టర్‌ విజయ్‌రాఘవన్‌, ఆరోగ్య, పౌర విమానయాన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని