Jaishankar: ఆర్థిక వృద్ధికి కృషిచేస్తోన్న కేంద్రం, విదేశాంగ మంత్రి జైశంకర్‌

పరివర్తనాత్మక ఆర్థిక వృద్ధి, జీవన సౌలభ్యం (ఈజ్‌ఆఫ్‌ లివింగ్‌), ‘సేవ’ స్ఫూర్తితో  ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా కేంద్రం కృషిచేస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. గుడ్‌ గవర్నెన్స్‌ ...

Published : 21 Dec 2021 23:26 IST

దిల్లీ: పరివర్తనాత్మక ఆర్థిక వృద్ధి, జీవన సౌలభ్యం (ఈజ్‌ఆఫ్‌ లివింగ్‌), ‘సేవ’ స్ఫూర్తితో  ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా కేంద్రం కృషిచేస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. గుడ్‌ గవర్నెన్స్‌ వీక్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సేవానిరతితో ఆర్థిక వృద్ధి దిశగా పయనిస్తోందని, ఇది ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. వందేభారత్ మిషన్‌, ఆపరేషన్‌ దేవిశక్తి వంటివి ప్రభుత్వ విధానాలకు అద్భుతమైన ఉదాహరణలుగా పేర్కొన్నారు. పోస్టాఫీస్‌లలో పాస్‌పోర్టు దరఖాస్తులను స్వీకరించడం ప్రభుత్వ గరిష్ట పాలనకు నిదర్శనమన్నారు. 75 సంవత్సరాల ప్రగతిశీల భారత్‌ను స్మరించుకోవడానికి ఆజాదీకా అమృత్‌ మహోత్సవ వేడుకల ద్వారా పౌర కేంద్రీకృత పాలనను ప్రోత్సహించడంలోనూ, ప్రభుత్వ సేవలను ఇళ్ల ముంగిటకు చేర్చేలా చేపట్టిన చర్యలు భారత్‌ సాధించిన ప్రగతికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని