Jharkhand: ఝార్ఖండ్‌ రైలు దుర్ఘటనలో.. ప్రాణాలు కాపాడిన చాయ్‌వాలా

అగ్నిప్రమాదం వదంతులతో ఝార్ఖండ్‌ వద్ద జరిగిన రైలు దుర్ఘటనలో చాయ్‌ అమ్మే వ్యక్తి ఒకరు పలువురు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఆ సమయంలో అతడు హెచ్చరించకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగేది.

Published : 16 Jun 2024 06:19 IST

అగ్నిప్రమాదం వదంతులతో ఝార్ఖండ్‌ వద్ద జరిగిన రైలు దుర్ఘటనలో చాయ్‌ అమ్మే వ్యక్తి ఒకరు పలువురు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఆ సమయంలో అతడు హెచ్చరించకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగేది. శుక్రవారం రాత్రి రాంచీ నుంచి సాసారాం (బిహార్‌) వెళుతున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ కుమండీహ్‌ సమీపానికి రాగానే మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతిని నమ్మి కొందరు ప్రయాణికులు భయంతో కిందికి దూకేశారు. ఆ సమయంలో పక్కనున్న ట్రాక్‌ మీదికి వస్తున్న గూడ్స్‌ రైలు ఢీకొని వారిలో ముగ్గురు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రైలులో ప్రయాణిస్తూ గూడ్స్‌ రైలు రాకను గమనించిన చాయ్‌వాలా కొందరిని పక్కకు లాగి, పలువురిని అప్రమత్తం చేశాడు. ఆ చీకట్లో చాలామంది ప్రయాణికులకు తమను ఎవరు కాపాడారో కూడా తెలియలేదు. తమతోపాటు ప్రయాణిస్తున్న టీ విక్రేత కాపాడినట్లు తర్వాత తెలిసింది. ఒక వదంతి మూడు ప్రాణాలను బలిగొందని రైల్వే అధికారులు గుర్తించగా.. దాన్ని ఎవరు వ్యాప్తి చేశారనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని