Prashant Kishor: 5 సార్లు ఫోన్‌ మార్చినా..!

తన మొబైల్‌ ఫోన్‌ పలుమార్లు మార్చినా హ్యాకింగ్‌ మాత్రం కొనసాగుతూనే ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు.

Published : 20 Jul 2021 01:48 IST

దిల్లీ: తన మొబైల్‌ ఫోన్‌ పలుమార్లు మార్చినా హ్యాకింగ్‌ మాత్రం కొనసాగుతూనే ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ స్పైవేర్‌ పెగాసస్‌ బారిన పడిన భారతీయ ప్రముఖుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. ఈ అంశంపై ఆయన స్పందించారు. తన మొబైల్‌ ఫోన్‌ను ఇప్పటికే 5 సార్లు మార్చానని.. అయినా తాను హ్యాకింగ్‌ బారిన పడటం కొనసాగుతూనే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫొరెన్సిక్‌ నివేదిక ప్రకారం ఈ నెల 14న ఆయన ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడంలో ప్రశాంత్‌ కిశోర్‌ కీలక పాత్ర పోషించారు. అయితే అనంతరం ఆయన ఎక్కువగా భాజపా వ్యతిరేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంట్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ చేతిలో భాజపా ఓటమి చవిచూడటంలోనూ ఆయనదే కీలక పాత్ర.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని