Kerala: కేరళ అసెంబ్లీలో గందరగోళ దృశ్యాలు.. ఎమ్మెల్యేలను బలవంతంగా తరలించి..!

అసెంబ్లీలో వాయిదా తీర్మానాలపై చర్చించేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంపై కేరళ(Kerala) ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. దానిని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు.  

Updated : 15 Mar 2023 16:52 IST

తిరువనంతపురం: బుధవారం కేరళ అసెంబ్లీ(Kerala Assembly)లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. స్పీకర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన విపక్ష ఎమ్మెల్యేలను.. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. భద్రతా సిబ్బంది వారిని తీసుకెళ్లిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. 

కొచ్చి డంప్‌యార్డ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు చేసిన నిరసనపై పోలీసులు చర్యలు తీసుకోవడం, అలాగే మహిళల భద్రత వంటి అంశాలపై మంగళ, బుధవారాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్(UDF) అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు ఇచ్చింది. వాటిపై చర్చించేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. స్పీకర్ అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ యూడీఎఫ్‌ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆదేశాల మేరకు స్పీకర్‌ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఆ తర్వాత వారంతా సభ నుంచి వాకౌట్‌ చేసి, బ్యానర్లు పట్టుకొని స్పీకర్‌ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. దాంతో వారు కార్యాలయం ముందే కూర్చుకున్నారు. మరికొందరు నేలపై పడుకున్నారు. వారిని సిబ్బంది బలవంతంగా అక్కడి నుంచి తరలించి, నిరసనను భగ్నం చేశారు. ఇప్పుడు వారిని తీసుకెళ్లిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. తమతో పాటు తమ మహిళా ఎమ్మెల్యేలపై కూడా అధికార పార్టీ నేతలు, సిబ్బంది దాడి చేశారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని