Tattoos: టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌!

టాటూలు వేసుకున్న ఇద్దరు అత్యంత ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. పచ్చబొట్లు వేసుకున్న ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో వెలుగుచూసింది........

Published : 07 Aug 2022 01:45 IST

వారణాసి: టాటూలు వేసుకున్న ఇద్దరు అత్యంత ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. పచ్చబొట్లు వేసుకున్న ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో వెలుగుచూసింది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రి వైద్యురాలు ప్రీతి అగర్వాల్ వివరాల ప్రకారం.. వారణాసికి చెందిన 14మంది అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. కాగా వారికి జ్వరం లక్షణాలు ఉండగా.. టైఫాయిడ్, మలేరియాతోపాటు పలు పరీక్షలు నిర్వహించారు. అయినా ఫలితం తేలలేదు. జ్వరం తగ్గకపోవడంతో అనుమానంతో వారికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా.. 20 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతికి పాజిటివ్‌గా తేలింది.

అయితే, హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులతో శారీరకంగా వారు కలవలేదని, వారి రక్తం ద్వారా కూడా ఈ వ్యాధి సోకలేదని తేలింది. అయితే ఈ 14మంది కూడా ఈమధ్యే టాటూలు వేసుకున్నట్లు గుర్తించారు. ఓ సెంటర్‌లో వీరంతా టాటూలు వేసుకోగా.. వారికి ఒకే సూదితో ఈ పచ్చబొట్లు వేసినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టాటూలు వేసే సూదుల ధరలు అధికంగా ఉన్న కారణంగా డబ్బు ఆదా చేసుకునేందుకు కొన్ని షాపుల్లో ఇలా ఒకే సూదితో టాటూలు వేస్తున్నట్లు వైద్యురాలు ప్రీతి అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. సూది కొత్తదో, పాతదో నిర్ధరించుకున్న తర్వాతే పచ్చబొట్టు వేసుకోవాలని ఆమె సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని