Road accident: రోడ్డుపై కారు డోరు తీసేముందు చూసుకోకపోతే.. ఇలాంటి ప్రమాదాలే..!
నడిరోడ్లపై కారు డోరు తీసేముందు అద్దంలో ముందుగా వాహనాల రాకపోకలను గమనించుకోవాలంటూ కర్ణాటక స్టేట్ రోడ్ అథారిటీ సూచించింది.
బెంగళూరు: రోడ్డుపై కారు డోరు తీసే క్రమంలో జరిగిన పొరపాటు.. ఘోర ప్రమాదానికి దారితీసింది. డోరు తగలడంతో స్కూటీపై వెళ్తోన్న ఓ మహిళ రోడ్డుపై పడిపోయింది. సరిగ్గా అప్పుడే అటువైపు వస్తోన్న కారు ఆమెపై దూసుకెళ్లింది. కొద్దిరోజుల క్రితం బెంగళూరులో జరిగిన ఈ ఘటన వీడియోను తాజాగా కర్ణాటక స్టేట్ రోడ్ అథారిటీ ట్విటర్‌లో షేర్ చేసింది. ‘నడిరోడ్లపై కారు డోరు తీసేముందు అద్దంలో ముందుగా వాహనాల రాకపోకలను గమనించుకోండి. కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు’ అని ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ మహిళ పరిస్థితిపై నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మహిళ పరిస్థితిపై మాత్రం స్పష్టత లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్