చిరుతలు, మనుషులు కలిసి తిరుగాడే బెరా!.. ఎక్కడో తెలుసా?

మనకు కూతవేటు దూరంలో చిరుత సంచరిస్తోందని తెలిస్తేనే హడలిపోతాం. రాజస్థాన్‌లోని పాలీ జిల్లా బెరా గ్రామ ప్రజలు పక్కనే చిరుత ఉన్నా చూసీచూడనట్లు వెళతారు. 

Updated : 23 Mar 2023 08:55 IST

నకు కూతవేటు దూరంలో చిరుత సంచరిస్తోందని తెలిస్తేనే హడలిపోతాం. రాజస్థాన్‌లోని పాలీ జిల్లా బెరా గ్రామ ప్రజలు పక్కనే చిరుత ఉన్నా చూసీచూడనట్లు వెళతారు. ఇక్కడి చిరుతలు కూడా మనుషులకు ఏ మాత్రం హాని చేయకుండా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఆరావళి పర్వతాలకు సమీపంలో ఈ ప్రాంతం ఉంటుంది. సుమారు 50 ఏళ్ల క్రితం ఇక్కడికి సమీపంలోని కుంభాల్‌గఢ్‌ జాతీయ పార్కు నుంచి 6 చిరుతలు తప్పించుకున్నాయి. అవి అటుఇటూ తిరుగుతూ.. చుట్టూ కొన్ని కొండగుహలు, అటవీప్రాంతం కూడా ఉండటంతో బెరా గ్రామ పరిసరాలను ఆవాసంగా మలుచుకున్నాయి. దీంతో వాటి సంతతి క్రమంగా వృద్ధి చెంది, 2020 నాటికి 50-60 చిరుతలు సంచరిస్తున్నట్లు గ్రామస్థుల అంచనా. చిరుతలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన అటవీ అధికారులు ఈ ప్రాంతాన్ని జవాయ్‌ లెపర్డ్‌ కన్జర్వేషన్‌ జోన్‌గా ప్రకటించారు. రహదారిపై వెళ్తున్నప్పుడు మధ్యలో చిరుతలు కనిపిస్తే అవి వెళ్లేంతవరకు ఈ గ్రామస్థులు ముందుకు కదలరు. అప్పుడప్పుడూ చిరుతలు స్థానికులు పెంచే పశువులను వేటాడతాయి. దీన్ని దైవబలిగా గ్రామస్థులు భావిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు