Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..8మంది నక్సల్స్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం.

Updated : 15 Jun 2024 15:24 IST

నారాయణ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. నారాయణ్‌పుర్‌, బీజాపుర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అటవీప్రాంతంలో  మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ (Encounter)లో ఎనిమిది మంది నక్సల్స్‌(Maoists) హతమయ్యారు. కాల్పుల్లో ఒక జవాన్ మరణించగా ఇద్దరు గాయపడ్డారు. నారాయణ్‌పుర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన  భద్రతా దళాల ఉమ్మడి బృందం కూంబింగ్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎదురు కాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని