Bhupesh Baghel: ఎయిర్‌పోర్టులో సీఎం అడ్డగింత.. నేలపై కూర్చున్న ముఖ్యమంత్రి

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే లఖింపుర్‌ ఖేరికి రాజకీయ నేతలు వెళ్లకుండా పోలీసులు

Updated : 05 Oct 2021 17:20 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే లఖింపుర్‌ ఖేరికి రాజకీయ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ లఖ్‌నవూ చేరుకోగా.. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో సీఎం నేలపై కూర్చుని నిరసన తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోను సీఎం భూపేశ్‌ భగేల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఎలాంటి ఆదేశాలు లేకుండానే పోలీసులు తనను ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. అంతేగాక, తాను లఖింపుర్‌కు వెళ్లట్లేదని తెలిపారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పర్యటన నేపథ్యంలో, ఆదివారం లఖింపుర్‌ ఖేరీలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ అక్కడి తికోనియా-బన్బీర్‌పుర్‌ రహదారిపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. వారిపైకి ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహానికి గురైన అన్నదాతలు ఆందోళనకు దిగారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని