Chhattisgarh: అనుచిత వ్యాఖ్యల కేసు.. సీఎం తండ్రి అరెస్టు

ఓ వర్గం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తండ్రి నంద కుమార్‌ బఘేల్‌ అరెస్టయ్యారు.

Updated : 07 Sep 2021 17:39 IST

రాయ్‌పూర్‌: ఓ వర్గం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తండ్రి నందకుమార్‌ బఘేల్‌ అరెస్టయ్యారు. మంగళవారం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు రాయ్‌పూర్‌ కోర్టులో హాజరుపర్చారు.

ఓ వర్గం వారిని విదేశీయులుగా పేర్కొంటూ నందకుమార్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలు ఆ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉండటంతో పాటు కులాల మధ్య విరోధం పెంచేలా ఉన్నాయంటూ సీఎం తండ్రిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేడు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

ఈ వివాదంపై ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ స్పందిస్తూ.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్న విషయం తెలిసిందే. ఓ కుమారుడిగా తన తండ్రిని గౌరవిస్తానని.. అదే సమయంలో మతసామరస్యం దెబ్బతినేలా ఎవరు వ్యాఖ్యలు చేసిన క్షమించేది లేదని అన్నారు. సీఎం తండ్రయినా సరే.. చట్టానికి లోబడి ఉండాల్సిందేన్నానరు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు