Chhattisgarh: ఇకపై అక్కడ ఉద్యోగులకు వారానికి 5రోజులే పని

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఛత్తీస్‌గఢ్ సర్కారు తీపి కబురు అందించింది.

Published : 26 Jan 2022 18:58 IST

రాయ్‌పుర్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఛత్తీస్‌గఢ్ సర్కారు తీపి కబురు అందించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారానికి 5 రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతోపాటు ఉద్యోగుల పింఛన్‌లో కూడా సర్కారు వాటాను పెంచనున్నట్టు వెల్లడించింది. అన్ష్ దయి పెన్షన్ పథకంలో భాగంగా ప్రస్తుతం 10 శాతం ఇస్తున్న రాష్ట్ర సర్కారు వాటాను 14 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు 2022-23 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అన్ని పంటలు, తృణధాన్యాలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని