Published : 08 Jul 2022 02:07 IST

bagless days: అక్కడి స్కూళ్లలో విద్యార్థులకు ఇక ప్రతి ‘శనివారం ప్రత్యేకమే’!

రాయ్‌పూర్‌: విద్యార్థులను పాఠశాలతో అనుసంధానం చేసేలా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఓ వినూత్న కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. పిల్లల్లో స్కూల్‌ పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు వినోదాత్మకంగా విద్యనందించేందుకు ‘బ్యాగ్‌లెస్‌ డేస్‌’ పేరిట ప్రత్యేకంగా ఒక రోజునే కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రోజూ బండెడు పుస్తకాలతో బ్యాగ్‌లు మోసుకెళ్లే విద్యార్థులకు ఇకపై ప్రతి శనివారం ఆ భారం తప్పనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు పుస్తకాలతో కుస్తీ పట్టినా.. శనివారం మాత్రం విద్యార్థులకు యోగా, వ్యాయామం, క్రీడలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యను ఆసక్తికరంగా, ఆచరణాత్మకంగా తీర్చిదిద్దడంలో భాగంగా విద్యాశాఖ ఈ చర్యలు తీసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

‘‘శనివారాలు పాఠశాలల్లో యోగా, వ్యాయామం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇలాంటి చర్యలతో పిల్లల్లో పాఠశాలల పట్ల ఆసక్తి కలిగేందుకు దోహదపడుతుంది. దీంతో పిల్లలు పాఠశాల విద్యను సమాచారాత్మకంగానే కాకుండా వినోదాత్మకంగా చూసే అవకాశం ఉంటుంది. త్వరలోనే దీన్ని అమలు చేసేలా జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశాం. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు వ్యాయామం, యోగా, క్రీడా పోటీలతో పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యకలాపాలు, విలువలతో కూడిన విద్య, కళాత్మక విద్యను అందించనున్నాం. ఆయా పాఠశాలల్లో ప్రతి శనివారం నిర్వహించే కార్యకలాపాల ప్రణాళికను నోటీస్‌ బోర్డుల్లో ఉంచాలని ఆదేశాలు జారీచేశాం’’ అని వివరించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని