భద్రతా బలగాలపై మావోయిస్టుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పేలుడు పదార్థాలతో ఓ ట్రక్కును మావోయిస్టులు పేల్చివేసిన ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

Published : 23 Jun 2024 21:08 IST

 

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పేలుడు మందుపాతరలతో ఓ ట్రక్కును పేల్చివేశారు. ఈ ఘటనలో.. సీఆర్పీఎఫ్‌ ‘కోబ్రా’ యూనిట్‌కు చెందిన ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) 201వ యూనిట్.. జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ పేలుడు సంభవించిందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్ శైలేంద్ర (29), కేరళకు చెందిన డ్రైవర్ విష్ణు (35) ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఆ సమయంలో ట్రక్కులో వీరిద్దరే ఉన్నారని వెల్లడించారు. 

దాడి సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన భద్రత దళాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ విచారం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని