
Chidambaram: నిందితుడిగా నా పేరు లేదు.. మరి నా ఇంట్లో సోదాలు ఎందుకు..?
దిల్లీ: లంచం తీసుకున్నారనే ఆరోపణలతో మంగళవారం కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. అలాగే ఆయన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇళ్లలోనూ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. దీనిపై ట్విటర్ వేదికగా చిదంబరం అసహనం వ్యక్తం చేశారు.
‘ఈ రోజు ఉదయం చెన్నైలోని మా ఇల్లు, దిల్లీలోని అధికారిక నివాసంలో సీబీఐ బృందం సోదాలు జరిపింది. అప్పుడు దర్యాప్తు సంస్థ అధికారులు నాకు ఎఫ్ఐఆర్ చూపించారు. అందులో నిందితుడిగా నా పేరు లేదు. చివరకు ఈ బృందం ఏమీ గుర్తించలేదు. వేటినీ స్వాధీనం చేసుకోలేదు’ అంటూ సోదాలు జరిగిన టైమింగ్‌ను ప్రశ్నించారు.
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కార్తి రూ.50 లక్షలు తీసుకుని 250 మంది చైనా దేశస్థులకు వీసా సదుపాయం కల్పించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ ఆయనపై కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మంగళవారం కార్తికి చెందిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. చెన్నై సహా ముంబయి, కర్ణాటక, పంజాబ్, ఒడిశా, దిల్లీలోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ క్రమంలోనే చిదంబరం నివాసంలోనూ సోదాలు జరిగాయి. అయితే ఈ తనిఖీలపై కార్తి ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. ‘కౌంట్ మర్చిపోయా.. ఎన్నిసార్లు ఇలాంటి సోదాలు జరిగి ఉంటాయి? బహుశా ఓ రికార్డు అయ్యి ఉంటుంది’ అని రాసుకొచ్చారు. కార్తి ఇప్పటికే పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
COVID cases: తెలంగాణలో భారీగా కొవిడ్ కేసులు.. హైదరాబాద్‌లో ఎన్నంటే?
-
Politics News
Andhra News: సొంత పార్టీ నేతలే నాపై కుట్ర చేస్తున్నారు: మాజీ మంత్రి బాలినేని ఆవేదన
-
Politics News
Loan apps: వద్దన్నా లోన్లు.. ‘నగ్న ఫొటో’లతో వేధింపులు!
-
Politics News
Maharashtra crisis: ఉద్ధవ్ ఠాక్రే రెండుసార్లు రాజీనామా చేయాలనుకున్నారు.. కానీ..!
-
Technology News
Instagram: ఇన్‌స్టాలో కొత్త రూల్.. సెల్ఫీ వీడియో, సోషల్ వోచింగ్తో వయసు ధ్రువీకరణ!
-
World News
Sri Lanka crisis: శ్రీలంకలో ఇంధనానికి టోకెన్లు.. స్కూళ్లు, ఆఫీసులు మూసివేత!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్