Chidambaram: డిసెంబర్‌కీ అందరికీ టీకా..ఒట్టి మాటే..

కరోనాను కట్టడి చేసే లక్ష్యంతో కేంద్రం నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమం నిదానంగా సాగుతోందని కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు చేశారు.

Published : 13 Jul 2021 17:29 IST

దిల్లీ: కరోనాను కట్టడి చేసే లక్ష్యంతో కేంద్రం నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమం నత్తనడకన సాగుతోందని కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. డిసెంబర్ చివరినాటికి దేశంలోని వయోజనులందరికీ టీకా అందించనున్నామనే ప్రభుత్వ హామీ.. ఒట్టి ప్రగల్భమంటూ నిందించారు. ఒడిశా, దిల్లీ టీకా కొరతను ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. ఏ ఆటంకం లేని టీకా పంపిణీ కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి ప్రణాళికలు వేస్తోందని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.

‘టీకా కొరత వాస్తవం. టీకా ఉత్పత్తి అతిశయోక్తి. టీకా దిగుమతి ఒక రహస్యం. 2021 డిసెంబరు నాటికి వయోజనులందరికీ టీకా వేస్తామన్న ప్రభుత్వ హామీ ఒట్టి ప్రగల్భం. టీకా కార్యక్రమం గురించి నూతనంగా నియమితులైన ఆరోగ్య శాఖ మంత్రి దేశానికి సమాధానం చెప్పాలి. నిరంతరాయంగా టీకా పంపిణీ జరిగేందుకు ఎలాంటి ప్రణాళికలు వేశారో వెల్లడించాలి’ అంటూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఒడిశాలోని 30 జిల్లాల్లో 24 జిల్లాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ‘ఒడిశాలోని అధికార పార్టీ భాజపా మిత్రపక్షం. ఇప్పుడు ఆ రాష్ట్రంలో టీకా కొరత ఎదుర్కొంటోంది. ఇంతకాలం టీకా కొరతపై వస్తోన్న వార్తలను తోసిపుచ్చిన కేంద్రం ఇప్పుడు ఏం చెప్తుంది’ అని ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు