Ayodhya: అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాన పూజారి కన్నుమూత

అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ (86) కన్నుమూశారు.

Updated : 22 Jun 2024 15:41 IST

లఖ్‌నవూ: అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కాశీలో పేరొందిన పండితుల్లో ఒకరిగా గుర్తింపుపొందిన లక్ష్మీకాంత్‌ స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. అయితే, ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలోనే నివసిస్తోంది. మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రశ్నపత్రం లీక్ చేసిన ఛానెళ్లపై టెలిగ్రాం కొరడా

లక్ష్మీకాంత్‌ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన్ను దేశంలోని గొప్ప పండితుల్లో ఒకరిగా పేర్కొన్న ప్రధాని మోదీ.. కాశీ విశ్వనాథ్ ధామ్, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సంస్కృత భాషకు, భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సీఎం ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు. జనవరి 22న ప్రధాని మోదీ చేతులమీదుగా అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని