Aadhaar: ‘ఆధార్‌’లో పేరు చూసి షాక్‌.. చిన్నారికి స్కూల్‌ అడ్మిషన్‌ నిరాకరణ!

ఆధార్‌ కార్డులో ఓ చిన్నారి పేరు అసాధారణ రీతిలో ఉండటంతో షాకైన ఉపాధ్యాయులు పాఠశాలలో ప్రవేశం నిరాకరించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌లో వెలుగుచూసింది. .....

Updated : 05 Apr 2022 15:13 IST

బదౌన్‌: ఆధార్‌ కార్డులో ఓ చిన్నారి పేరు అసాధారణ రీతిలో ఉండటంతో షాకైన ఉపాధ్యాయులు పాఠశాలలో ప్రవేశం నిరాకరించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌లో వెలుగుచూసింది. బెల్సి తహశీల్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన దినేశ్ అనే వ్యక్తి శనివారం తన కుమార్తెను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేందుకు వెళ్లగా అక్కడి ఉపాధ్యాయులు ఆధార్‌ కార్డును చూసి కంగుతిన్నారు. ఆధార్‌పై బాలిక పేరు స్థానంలో ‘‘మధుకా పాంచ్వా బచ్చా’’ అని హిందీలో.. ‘‘బేబీ ఫైవ్ ఆఫ్ మధు’ అని ఆంగ్లంలో రాసి ఉండటమే అందుకు కారణం.  అలాగే, ఆ కార్డుపై నంబర్‌ కూడా లేకపోవడం గమనార్హం. దీనిపై అధికారులు స్పందించారు. ఆధార్‌ కార్డుపై పేరు విచిత్రంగా ఉండటంతో అడ్మిషన్‌ నిరాకరించిన ఉపాధ్యాయులు.. కార్డుపై పేరు మార్పించుకోవాలని దినేశ్‌కు సూచించినట్టు పేర్కొన్నారు.

ఈ విషయం కలెక్టర్‌ దీపా రంజన్‌ దృష్టికి వెళ్లడంతో ఆమె స్పందించారు. ఆధార్‌ కార్డులు పోస్టాఫీసులు, బ్యాంకుల్లో నమోదవుతున్నాయని.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వల్లే ఈ తప్పు దొర్లినట్టు చెప్పారు. బ్యాంకు, పోస్టాఫీసులను అప్రమత్తం చేస్తామనీ.. ఈ కార్డు జారీకి సంబంధించిన బాధ్యుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆధార్‌ కార్డుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని