Rahul Gandhi's Photo: ట్విటర్‌కు ఎన్సీపీసీఆర్‌ నోటీసులు..!

హత్యాచారానికి గురైనట్టుగా అనుమానిస్తున్న తొమ్మిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ షేర్‌ చేసిన ఫొటోను తొలగించాలంటూ జాతీయ

Published : 05 Aug 2021 01:50 IST

దిల్లీ: హత్యాచారానికి గురైనట్టుగా అనుమానిస్తున్న తొమ్మిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ షేర్‌ చేసిన ఫొటోను తొలగించాలంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్సీపీసీఆర్‌) ట్విటర్‌ ఇండియాకు బుధవారం నోటీసులు జారీ చేసింది. మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శిస్తున్న ఫొటోను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. అందులో రాహుల్‌ సహా చిన్నారి తల్లిదండ్రుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆ ఫొటోను తొలగించాల్సిందిగా రాహుల్‌కు నోటీసులు పంపాలంటూ ట్విటర్‌ ఇండియా గ్రీవెన్స్‌ అధికారిని ఎన్సీపీసీఆర్‌ ఆదేశించింది. అత్యాచార బాధిత కుటుంబాలకు సంబంధించిన వివరాలను బహిరంగపరచడం పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.

దిల్లీలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులను రాహుల్‌ గాంధీ, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం వేర్వేరుగా పరామర్శించారు. అనంతరం వారి ఫొటోను ట్విటర్‌లో రాహుల్‌ పోస్టు చేశారు. వారి కన్నీళ్లు కోరుకునేది తమ బిడ్డకు న్యాయం జరగాలని మాత్రమే అంటూ ఆ పోస్టులో ఆయన వ్యాఖ్యానించారు.

 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని