Vaccine: 15-18 ఏళ్ల వారికి జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు..

దేశంలో 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకాలను అందించేందుకుం కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ వయసు వారికి జనవరి 1 కొవిన్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో

Updated : 27 Dec 2021 14:34 IST

దిల్లీ: దేశంలో 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకాలను అందించేందుకుం కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ వయసు వారికి జనవరి 1 నుంచి కొవిన్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నట్లు సోమవారం వెల్లడించింది. విద్యాసంస్థల ఐడీ కార్డులతోనూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

‘‘15-18 ఏళ్ల మధ్య పిల్లలు జనవరి 1 నుంచి కొవిన్‌ యాప్‌లో టీకా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆధార్‌, ఇతర ఐడీ కార్డులు లేని పిల్లలు విద్యాసంస్థలు జారీ చేసే స్టూడెంట్‌ ఐడీ కార్డులతోనూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు’’ అని కొవిన్‌ ప్లాట్‌ఫామ్‌ చీఫ్‌ డా. ఆర్‌ఎస్‌ శర్మ వెల్లడించారు. వీరికి జనవరి 3 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది.

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉద్ధృతి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గతవారం తెలిపారు. ఇక 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు’ టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని