కరోనా నకిలీ వ్యాక్సిన్ల సరఫరా..80 మంది అరెస్టు

కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కరోనా నిరోధక నకిలీ టీకాలు సరఫరా చేస్తున్న 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నకిలీ టీకాలు ఇప్పటికే ఆఫ్రికా చేరినట్లు అధికారులు వెల్లడించారు....

Updated : 03 Feb 2021 13:29 IST

బీజింగ్‌: కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కరోనా నిరోధక నకిలీ టీకాలు సరఫరా చేస్తున్న 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నకిలీ టీకాలు ఇప్పటికే ఆఫ్రికా చేరినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన నేరాలను అరికట్టేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 80 మందిని అరెస్టు చేశారని, 3000 మోతాదుల నకిలీ టీకాలను స్వాధీనం చేసుకున్నారని చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. బీజింగ్‌, జియాంగ్, శాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లలో పోలీసులు ఈ దాడులు చేశారు. గత సెప్టెంబర్‌ నుంచి నకిలీ టీకాలు తయారుచేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ నిందితులు లాభాలు పొందుతున్నారని అధికారులు తెలిపారు. కరోనా నకిలీ వ్యాక్సిన్లను అక్రమంగా ఆఫ్రికాకు రవాణా చేసినట్లు వెల్లడించారు. అయితే, వాటిని ఎలా దేశం దాటించారనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి నేర కార్యకలాపాలను నివారించేందుకు ఇతర దేశాల సహకారం అందించాలని చైనా విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది.

ఇవీ చదవండి...

82 దేశాల్లో విస్తరించిన కొత్తరకం వైరస్‌

నావల్నీకి జైలు శిక్ష.. భగ్గుమన్న రష్యా!


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని