CHINA: పాక్‌ మీడియాను గుప్పిట పెట్టుకొనేందుకు చైనా యత్నం

పాక్‌ పాలకులతో ఉన్న సంబంధాలను వాడుకొని ఆ దేశ మీడియా సంస్థలను గుప్పిట పెట్టుకొనేందుకు చైనా యత్నాలు మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల

Published : 15 Dec 2021 18:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ పాలకులతో ఉన్న సంబంధాలను వాడుకొని ఆ దేశ మీడియా సంస్థలను గుప్పిట పెట్టుకొనేందుకు చైనా యత్నాలు మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా పత్రిక తన రిపోర్టులో పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ దేశాల ప్రచారాన్ని అడ్డుకొంటూ.. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు ఈ వ్యూహం అమలు చేస్తోంది.

సెప్టెంబర్‌లో పాక్‌-చైనా మీడియా ఫోరం సదస్సును తొలిసారి నిర్వహించారు. ఇరు దేశాలకు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని అడ్డుకోవడంపై దీనిలో చర్చించారు. తమ దేశాలపై జరిగే దుష్ప్రచారాన్ని అడ్డుకొంటామని ఈ ఫోరంలో పాల్గొన్నవారు ప్రతిజ్ఞ చేశారు. ఇందు కోసం చైనా-పాకిస్థాన్‌ మీడియా కారిడార్‌ను ఏర్పాటు చేసి ఇరు దేశాల మధ్య సంబంధాలు, సమన్వయాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ మీడియాపై చైనా ఓ పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సంస్థ పాక్‌ మీడియాలో ప్రచురించాల్సిన అంశాలను వెల్లడించడంతో పాటు సెన్సార్‌షిప్‌ వంటి వాటిని పరిశీలిస్తుంది. పాక్‌లోని చైనా రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ‘షినూవా ఉర్దూ’, ‘గ్వాదర్‌ ప్రో’, ‘చైనా గ్లోబల్‌’ టెలివిజన్‌ వంటి సంస్థలు పనిచేస్తాయని వాషింగ్టన్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని