China: మూడేళ్లు పైబడిన చిన్నారులకు వ్యాక్సిన్‌

మూడేళ్లు పైబడిన చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది. 3 నుంచి 17ఏళ్లు వయసు కలిగిన వారికి అత్యవసర వినియోగం కింద ‘కరోనావ్యాక్‌’ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అనుమతి లభించినట్లు ఔషధ తయారీ సినోవ్యాక్‌ ఛైర్మన్‌ ఇన్‌ వియోడాంగ్‌ తెలిపారు.

Published : 06 Jun 2021 23:55 IST

బీజింగ్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సికేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశాయి. మరి తొలిసారి కరోనా వైరస్‌ బయటపడిన చైనాలో పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఆ దేశంలో వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. మరోవైపు చిన్నారులు కూడా కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఆ దేశం చర్యలు చేపట్టింది. మూడేళ్లు పైబడిన చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది. 3 నుంచి 17ఏళ్లు వయసు కలిగిన వారికి అత్యవసర వినియోగం కింద ‘కరోనావ్యాక్‌’ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు  అనుమతి లభించినట్లు ఔషధ తయారీ సినోవ్యాక్‌ ఛైర్మన్‌ ఇన్‌ వియోడాంగ్‌ తెలిపారు.

‘కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చినప్పటికీ  ఏ వయసు చిన్నారులకు ఇవ్వాలనేది ఇప్పుడే నిర్ణయించారు’ అని ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌కు తెలిపారు. సినోవాక్‌ ఇప్పటికే ఫేజ్‌-1, 2 క్లినికల్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. వందలాది వాలంటీర్లు ఇందులో పాల్గొనగా, వ్యాక్సిన్‌ సురక్షితమని, సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా జూన్‌ 1వ తేదీ నుంచి సినోవాక్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకూ చైనాలో 763 మిలియన్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోస్‌లను అందించారు. మొత్తం చైనాలో 5 వ్యాక్సిన్‌లను అత్యవసర వినియోగం కింద ఉపయోగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని