china: ఇకపై చైనాలో ఆ పాటలు నిషేధం

సంగీత ప్రపంచంలో కారియోకీ పాటలకు అభిమానుల సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా బార్స్‌లో ఇలాంటి పాటలను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. 

Published : 13 Aug 2021 01:35 IST

బీజింగ్‌: సంగీత ప్రపంచంలో కారియోకీ పాటలకు అభిమానుల సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా బార్స్‌లో ఇలాంటి పాటలను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. తాజాగా చైనా సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ కారియోకీ పాటలను చట్టవిరుద్ధంగా భావించి వాటిని నిషేధించింది. అక్టోబర్‌ 1 నుంచి వీటిని ప్రదర్శించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. చైనాలో వినోదాన్ని పంచే కారియోకీ అవుట్లెట్లు సుమారు 50వేలు ఉండగా.. ఇందులో లక్షకుపైగా పాటలను ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల మేరకు ఇవన్నీ మూతబడనున్నాయి. సాధారణంగా కారియోకీ ప్రదేశాల్లో ప్రదర్శించే పాటలకు అక్కడ పనిచేసే కంటెంట్‌ ప్రొవైడర్స్‌ బాధ్యత వహిస్తారు. ఇకపై ఈ పాటల స్థానంలో ఆరోగ్యకరమైన పాటలను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎందుకిలా అంటే..

చైనా జాతీయ ఐక్యత, సార్వభౌమత్వానికి హాని కల్పించేలా ఈ కారియోకీ పాటలు ఉన్నాయట. అంతేకాదు.. మతపరమైన విధానాలను ఉల్లంఘించడం, జూదం మాదకద్రవ్యాల వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్న కారణంగా వీటిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది ఈ డ్రాగన్‌ దేశం. ఇటీవల సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్స్‌లో హింస, పోర్న్‌ వీడియోలు, రాజకీయాలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలను తీవ్రంగా నిషేధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని