Published : 10 Aug 2021 17:59 IST

Coronavirus: చైనాలో చాపకింద నీరులా వైరస్‌.. 7 నెలల్లోనే అత్యధికం

బీజింగ్‌: కరోనాకు కళ్లెం వేశామని ఆనందిస్తున్న చైనా వాసులను వైరస్‌ మళ్లీ భయపెడుతోంది. చైనాలో వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 143 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ దేశ అధికారులు వెల్లడించారు. నమోదైన వాటిల్లో ఎక్కువగా డెల్టా వేరియంట్‌ కేసులేనని అధికారులు గుర్తించారు. గత ఏడు నెలల కాలంగా ఇవే అత్యధికమని చైనా హెల్త్ కమిషన్ తెలిపింది.

స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం ద్వారా కొత్తగా చైనాలో 108 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. విదేశాల నుంచి చైనాకు వచ్చిన 35 మందికి కూడా వైరస్‌ సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. కేసులు మళ్లీ పెరుగుతుండటం చైనీయుల్లో ఆందోళనను పెంచుతోంది. కరోనా పుట్టినిల్లు వుహాన్‌లోనూ 63 లోకల్‌ ట్రాన్స్‌మిటెడ్‌ కేసులున్నట్లు చైనా అధికార పత్రిక జిన్హువా న్యూస్‌ వెల్లడించింది. దేశంలోని 23 ప్రావిన్స్‌లలో 13 ప్రాంతాల్లో డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందడం చైనా ఆరోగ్య అధికారుల్లో ఆందోళన పెంచుతోంది.

పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్‌ కట్టడికి ఆదివారం నుంచి కఠిన చర్యలకు ఉపక్రమించింది. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. కొవిడ్ కేసులున్న ప్రావిన్సుల నుంచి ఆ దేశ రాజధాని బీజింగ్‌కు వెళ్లేవారిపై నిషేధం విధించింది. కొవిడ్‌ పరీక్షలను వైగవంతం చేసింది. కాగా టెస్టులు చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారంటూ కొందరు అధికారులను ప్రభుత్వం హెచ్చరించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని