అరుణుడి చిత్రాలను విడుదల చేసిన చైనా

అంగారకుడిపై జీవం ఉనికి తెలుసుకునేందుకు గతేడాది చైనా పంపిన తియెన్ వెన్-1 వ్యోమనౌకను పంపింది.

Published : 11 Jun 2021 18:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంగారకుడిపై జీవం ఉనికి తెలుసుకునేందుకు గతేడాది చైనా తియెన్ వెన్-1 వ్యోమనౌకను పంపింది. అది అంగారకుడి కక్ష్యలో మూడు నెలల పరిభ్రమణం అనంతరం మే 14న విజయవంతంగా అరుణ గ్రహం మీద కాలుమోపింది. ఈ వ్యోమ నౌకలోని రోవర్‌ జూరాంగ్‌ పంపిన మార్స్ ఉపరితల చిత్రాలను చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ సీఎస్‌ఏ విడుదల చేసింది. రోవర్‌లో ప్రత్యేకంగా అమర్చిన కెమెరా పది మీటర్ల ఎత్తులో ఫొటోలు తీసినట్లు పేర్కొంది. ఈ చిత్రాల్లో ఎరుపు వర్ణంలో అంగారకుడి ఉపరితలం మెరిసిపోతోంది. ఉపరితలంపై చిందర వందరగా పడిఉన్న రాళ్లు, దుమ్మును రోవర్ తన కెమెరాల్లో బంధించింది. వీటితో పాటు ల్యాండర్‌తో రోవర్ దిగిన సెల్ఫీ ఫొటోలను కూడా సీఎస్‌ఏ విడుదల చేసింది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని