China: శుభవార్త చెప్పిన చైనా.. భారతీయులకు వీసాలు

చైనాలో పనిచేస్తూ స్వదేశంలో ఉండిపోయిన భారతీయులు, వారి కుటుంబీకులకు బీజింగ్‌ ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త చెప్పింది........

Published : 15 Jun 2022 02:14 IST

బీజింగ్‌: చైనాలో పనిచేస్తూ స్వదేశంలో ఉండిపోయిన భారతీయులు, వారి కుటుంబీకులకు బీజింగ్‌ ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా భారత్‌లో ఉండిపోయిన అక్కడ పనిచేసేవారికి వీసాలను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించింది. చైనాలోని అన్ని రంగాల్లో పనిచేసేవారు, వారి కుటుంబసభ్యులు తిరిగి చైనాకు వెళ్లాలనుకువారి వీసా దరఖాస్తులను ఆమోదిస్తున్నట్లు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం వెల్లడించింది. తాజా నిర్ణయంతో గత రెండేళ్లుగా భారత్‌లో ఉండిపోయిన వందలాది భారతీయ కుటుంబాలకు ఊరట లభించినట్లయింది.

దీంతోపాటు అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వేలాది మంది భారతీయ విద్యార్థుల అభ్యర్థననూ బీజింగ్‌ పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా 2020లో భారతీయ ఉద్యోగులతోపాటు, అక్కడి యూనివర్సిటీల్లో చదువుకునే వేలాదిమంది విద్యార్థులను చైనా.. భారత్‌కు పంపించిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లు గడిచినా వారికి మళ్లీ వీసాలు మంజూరు చేయలేదు. పలు వినతులు, పరిశీలనల అనంతరం డ్రాగన్‌ తాజా నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని