చైనాలో భారీగా పెరిగిన ఎగుమతులు

కరోనా తగ్గుముఖం పట్టడంతో కర్మాగారాలను తిరిగి తెరిచిన నేపథ్యంలో చైనా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఎగుమతులు భారీగా పెరిగాయి. 2020 జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే 2021లో అదే కాలానికి చైనా ఎగుమతులు....

Updated : 08 Mar 2021 11:32 IST

బీజింగ్‌: కరోనా తగ్గుముఖం పట్టడంతో కర్మాగారాలను తిరిగి తెరిచిన నేపథ్యంలో చైనా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఆ దేశ ఎగుమతులు భారీగా పెరిగాయి. 2020 జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే 2021లో అదే కాలానికి చైనా ఎగుమతులు ఏకంగా 60 శాతం వృద్ధి చెందాయి. 2020 డిసెంబర్‌లో కేవలం 18.1 శాతం మాత్రమే ఉండగా విశ్లేషకుల అంచనాలను దాటి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో భారీగా పెరిగాయి. చైనా ఎగుమతుల విలువ రెండు నెలల్లో 468.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. దిగుమతుల్లో కూడా 22.2 శాతం వృద్ధి నమోదై 365.6 బిలియన్లకు చేరుకున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో సుంకాలు పెంచినా ఈ రెండు నెలల్లో చైనా నుంచి అమెరికాకు కూడా ఎగుమతులు 87.3 శాతం పెరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని