గల్వాన్‌ ఘటన.. చైనా వీడియో

లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో గతేడాది భారత్‌- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఓ వీడియోను డ్రాగన్‌ దేశం తాజాగా విడుదల చేసింది. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతున్న వేళ ఈ వీడియో...

Published : 20 Feb 2021 00:45 IST

దిల్లీ: లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో గతేడాది భారత్‌- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఓ వీడియోను డ్రాగన్‌ దేశం తాజాగా విడుదల చేసింది. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతున్న వేళ ఈ వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ విడుదల చేసింది. భారత బలగాలే చైనా వైపు దూసుకొచ్చినట్లు అందులో పేర్కొంది. ఇరు దేశాల సైన్యాలు వాగ్వాదం జరిగినట్లు అందులో కనిపించింది. ఈ ఘర్షణలో నలుగురు చైనా సైనికులు మరణించారని, వారికి నివాళులర్పిస్తున్నట్లు చైనా పేర్కొంది. అయితే, ఇదే దాడి ఘటనలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబుతో పాటు మరో 19 మంది అమరులైన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన 30 మంది సైనికులు ఈ ఘటనలో మరణించినట్లు భారత సైన్యం చెబుతుండగా.. కేవలం నలుగురు మాత్రమే మరణించినట్లు చైనా ప్రకటించడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని