America: ‘చైనా, రష్యాలకు తెలుసు మా బలం ఏంటో.. తైవాన్‌ను రక్షిస్తాం’

చైనా- తైవాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్‌ను తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై తైవాన్‌తో కమిట్‌మెంట్‌ ఉందని వెల్లడించారు. ఓ వార్తాసంస్థ...

Updated : 22 Oct 2021 14:06 IST

వాషింగ్టన్‌: చైనా- తైవాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్‌ను తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై తైవాన్‌తో కమిట్‌మెంట్‌ ఉందని వెల్లడించారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో భాగంగా బైడెన్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనా, రష్యా సహా ఇతర దేశాలకూ తెలుసు.. తాము ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలిటరీ దేశం అని’ ఆయన పేర్కొన్నారు.

మరోవైపు తైవాన్‌ విషయంలో అమెరికా పాలసీల్లో ఎటువంటి మార్పులు లేవని వైట్‌హౌస్‌ అధికారులు స్పష్టం చేశారు. తైవాన్‌ విషయంలో చైనా కొన్నాళ్లుగా దుందుడుకు ధోరణి కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. తైవాన్‌ను తమ భూమిగా పేర్కొంటూ.. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తైవాన్‌ గగనతలంలోకి ఏకంగా 52 యుద్ధ విమానాలను పంపించింది. కొన్నాళ్లుగా చైనా ఇదే తరహాలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తైవాన్‌-చైనాలను ఏకం చేసి తీరతామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సైతం వ్యాఖ్యానించారు. మరోవైపు తైవాన్‌ సైతం డ్రాగన్‌ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గమని తేల్చి చెబుతూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని