China: చైనా దూకుడు.. 3 రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాల ప్రయోగం

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. శనివారం మరో మూడు రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది......

Published : 06 Nov 2021 16:15 IST

బీజింగ్‌: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. శనివారం మరో మూడు రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. పశ్చిమ చైనాలోని సిచౌన్​ ప్రావిన్స్​, జిచాంగ్​ శాటిలైట్​ లాంచ్‌​ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు చైనా వెల్లడించింది. యోగాన్​-35 విభాగానికి చెందిన ఈ మూడు ఉపగ్రహాలను లాంగ్​ మార్చ్​-2డీ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లినట్లు చైనా అధికారిక మీడియా పేర్కొంది. లాంగ్​ మార్చ్​ సిరీస్​ రాకెట్స్​ ద్వారా చేపట్టిన 396వ మిషన్​గా తెలిపింది.

2019 మార్చిలో లాంగ్​ మార్చ్​-3బీ రాకెట్​ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. చైనా విజయవంతంగా పూర్తి చేసిన 300వ ప్రయోగంగా అది నిలిచినట్లు పేర్కొంది. లాంగ్​ మార్చ్​ వాహక రాకెట్​ సిరీస్​ను చైనా ఎయిరోస్పేస్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ కార్పొరేషన్​ అభివృద్ధి చేసింది. చైనా చేపట్టిన మొత్తం ప్రయోగాల్లో ఈ రాకెట్ల ద్వారానే 96.4 శాతం పూర్తి చేయటం గమనార్హం. తొలి వంద ప్రయోగాలకు 37 ఏళ్లు పట్టగా.. తదుపరి వందకు 7.5 ఏళ్లు, ఆ తర్వాత నాలుగేళ్లలోనే మరో వంద ప్రయోగాలను చైనా చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని