China: చైనాను ఐరాస గుర్తించి 50 ఏళ్లు.. జిన్‌పింగ్‌ కీలక వ్యాఖ్యలు

పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(పీఆర్‌సీ)ను ఐరాస అధికారికంగా గుర్తించి 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఎల్లప్పుడూ ప్రపంచ శాంతిని కోరుకుంటుందని, అంతర్జాతీయ నియమాలనూ...

Published : 25 Oct 2021 15:26 IST

బీజింగ్: పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(పీఆర్‌సీ)ను ఐరాస అధికారికంగా గుర్తించి 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఎల్లప్పుడూ ప్రపంచ శాంతిని కోరుకుంటుందని, అంతర్జాతీయ నియమాలను పాటిస్తుందని పేర్కొన్నారు. చైనా, తైవాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇటీవల తారస్థాయి చేరుకున్న తరుణంలో జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా ప్రపంచ శాంతి నిర్మాత అని, అంతర్జాతీయ నియమాలను సంరక్షిస్తుందని జిన్‌పింగ్‌ వెల్లడించారు.

ప్రపంచ పటంపై ఆధిపత్య ధోరణి, అధికార రాజకీయాలు, ఏకపక్షవాదాన్ని తాము వ్యతిరేకిస్తామని జిన్‌పింగ్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రాంతీయ సంఘర్షణలు, తీవ్రవాదం, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ, బయో సెక్యూరిటీ తదితర అంశాల్లో మరింత సహకారం అవసరమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. దీంతోపాటు భారత్‌, జపాన్‌, ఆగ్నేయాసియా దేశాలతో భూ, జల వివాదాలపై తమ వాదనలను సమర్థించుకున్నారు. 1971లో ఐరాస.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా(పీఆర్‌సీ)ను గుర్తించింది. అదే సమయంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(తైవాన్‌)కు గుర్తింపును తొలగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని