బలగాల్ని వెనక్కి తీసుకుంటున్నాం: చైనా

ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్‌, చైనా చర్యలు చేపట్టాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు.....

Updated : 10 Feb 2021 18:43 IST

బీజింగ్‌: ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్‌, చైనా చర్యలు చేపట్టాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్‌ సరస్సు నుంచి చైనా, భారత్‌ బలగాల ఉపసంహరణ నేటి నుంచి ప్రారంభమైనట్టు రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ యూ కియాన్‌ తెలిపారు. అయితే, ఈ అంశంపై భారత్‌ వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. తొమ్మిదో రౌండ్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు చైనా, భారత సాయుధ దళాలు నేటి నుంచి ప్యాంగాంగ్‌ నుంచి వెనక్కి రావడం ప్రారంభించాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది మే నెల నుంచి తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

చైనాలో చిక్కుకున్న నావికులు 14న భారత్‌కు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని