China: భూటాన్‌ భూమిలో 4 గ్రామాలు నిర్మించిన చైనా..!

భూటాన్‌ భూమిని చైనా కబ్జాచేయడం మొదలుపెట్టింది. ఈ తతంగం దాదాపు ఏడాది నుంచి జరుగుతోంది. దాదాపు 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో సరికొత్తగా నాలుగు గ్రామాలు

Published : 18 Nov 2021 16:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : భూటాన్‌ భూమిని చైనా కబ్జాచేయడం మొదలుపెట్టింది. ఈ తతంగం దాదాపు ఏడాది నుంచి జరుగుతోంది. దాదాపు 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో సరికొత్తగా నాలుగు గ్రామాలు వెలిసినట్లు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించే ‘డెట్రెస్‌ఫా’ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ పేర్కొంది. ఈ నిర్మాణాలు డోక్లాంకు సమీపంలో ఉండటం గమనార్హం. డోక్లాంలో భారత్‌-చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత ఈ నిర్మాణాలు జరగడం విశేషం. 2020 మే నుంచి 2021 నవంబర్‌ మధ్యలో ఈ నిర్మాణాలు జరిగాయి. 

భారత్‌ భూటాన్‌ సైన్యానికి శిక్షణ ఇవ్వడంతోపాటు.. విదేశీవ్యవహారాల్లో మార్గదర్శకత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజా నిర్మాణాలు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా భూటన్‌ సరిహద్దులపై చైనా ఒత్తిడిని పెంచుతూ వస్తోంది. ఇటీవల భూటాన్‌-చైనా మధ్య జరిగిన ఒప్పందం వివరాలు పూర్తిగా వెల్లడికాలేదు.. ఆ ఒప్పందంలో ఈ గ్రామాల అంశాన్ని ఏ మేరకు ప్రస్తావించారనే దానిపై స్పష్టత లేదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని