China: చైనా దళాల కదలికలు పెరిగాయి : లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే

భారత సరిహద్దుల వెంట చైనా దళాల గస్తీలు పెరిగాయని ఈస్టర్న్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పేర్కొన్నారు. దీంతోపాటు ఆ దేశ దళాలు వార్షిక యుద్ధవిన్యాసాలు

Published : 19 Oct 2021 15:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత సరిహద్దుల వెంట చైనా దళాల గస్తీలు పెరిగాయని ఈస్టర్న్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పేర్కొన్నారు. దీంతోపాటు ఆ దేశ దళాలు వార్షిక యుద్ధ విన్యాసాలు కూడా చేస్తున్నాయని తెలిపారు. అంతేకాదు సరిహద్దుల వద్ద మౌలిక సదుపాయల కల్పన కూడా చైనా వేగవంతం చేసిందని..  అక్కడ నిర్మాణాలు ఘర్షణలకు దారితీస్తున్నాయన్నారు.

‘‘చైనా సరిహద్దుల వద్ద వివిధ దళాలతో సమష్టిగా యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తోంది. వీటిల్లో పలు విభాగాలకు కీలక పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఏటా జరిగే యుద్ధ విన్యాసాల్లో ఈ ఏడాది కొంత మార్పు వచ్చింది. ఈ సారి తీవ్రత పెరిగింది. అంతేకాదు.. సుదీర్ఘంగా వీటిని చేపడుతున్నారు. గస్తీల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. వారికి శిక్షణ ఇచ్చే ప్రదేశాల్లో రిజర్వు దళాలు కొనసాగుతున్నాయి. గతేడాది నుంచి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈస్టర్న్‌ కమాండ్‌ సన్నద్ధతను పెంచింది. ఎలాంటి పరిస్థితిని 
ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉంది. ఎల్‌ఏసీలో నిఘాను గణనీయంగా పెంచాం. ఎటువంటి దాడి ఎదురైనా తట్టుకొనేందుకు సిద్ధంగా తగిన్నన్ని బలగాలు ఉన్నాయి. మన దళాల గస్తీ విధానాల్లో పెద్దగా మార్పులు చేయలేదు’’ అని లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పేర్కొన్నారు.

భారత దళాలు నిఘా కోసం డ్రోన్లు, రాడార్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను, రాత్రి వేళ చూడగలిగే పరికరాలను వినియోగిస్తున్నాయని పాండే తెలిపారు. దళాల అవసరాలు తీర్చేందుకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని