Pakistan: ఉగ్రమూకల చేతికి.. పాక్‌ సైన్యం టెలికాం పరికరాలు!

పాకిస్థాన్‌ సైన్యం అవసరాలకు చైనా కంపెనీలు రూపొందించిన టెలికాం పరికరాలు ఇప్పుడు ఉగ్రమూకల చేతుల్లోకి వచ్చాయని అధికారిక వర్గాలు తెలిపాయి.

Published : 23 Jun 2024 19:05 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir)లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ల సమయంలో వారి వద్ద నుంచి ఆధునిక సాంకేతికతతో కూడిన టెలికమ్యూనికేషన్‌ పరికరాలను (Ultra Set) భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌ (Pakistan) సైన్యం అవసరాలకు చైనా (China) సంస్థలు వాటిని రూపొందించాయని.. కానీ, అవి ఇప్పుడు ఉగ్రమూకల చేతుల్లోకి వచ్చాయని తెలిపారు. విదేశీ ఉగ్రవాదుల వద్ద ఈ పరికరాలను స్వాధీనం చేసుకోవడమనేది.. పాక్‌ నుంచి ఉగ్రసంస్థలకు శిక్షణ, ఆయుధాలు, మందుగుండు సామగ్రి అందుతున్నాయని సూచిస్తోందని చెప్పారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 26న బారాముల్లాలోని సోపోర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌ అనంతరం భద్రత బలగాలు పెద్దఎత్తున టెలికాం సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గత ఏడాది పూంఛ్‌ జిల్లాలోని సురాన్‌కోట్‌ ప్రాంతంలోనూ అల్ట్రాసెట్‌ హ్యాండ్‌సెట్‌లు పట్టుబడ్డాయి. దక్షిణ పీర్‌పంజాల్‌ ప్రాంతంలోనూ ఇవి లభ్యమయ్యాయి. ఈ వ్యవహారం.. ఎల్‌ఓసీ వెంబడి చొరబాట్లు, జమ్మూ-కశ్మీర్‌లోని పట్టణాలు, గ్రామ శివార్లలో ఉగ్రస్థావరాల విషయంలో ఆందోళన రేకెత్తిస్తోందని అధికారులు తెలిపారు.

11వ బిడ్డకు తండ్రైన మస్క్‌.. న్యూరాలింక్‌ ఉద్యోగినితో మూడో సంతానం

‘‘అల్ట్రాసెట్ హ్యాండ్‌సెట్‌లు సమాచార మార్పిడి కోసం జీఎస్‌ఎం, సీడీఎంఏ వంటి సాంప్రదాయ మొబైల్ సాంకేతికతలు కాకుండా.. రేడియో తరంగాలపై ఆధారపడి పనిచేస్తాయి. ఇవి సరిహద్దు ఆవలివైపు ఉన్న కంట్రోల్ స్టేషన్‌తో అనుసంధానమై ఉంటాయి. పాక్‌లోని మాస్టర్‌ సర్వర్‌కు సందేశాల చేరవేతకు చైనా ఉపగ్రహాల సేవలను ఉపయోగిస్తున్నారు’’ అని అధికారులు ఆరోపించారు. బీజింగ్ కొంతకాలంగా ఎల్‌ఓసీ వెంబడి పాక్‌ సైన్యం రక్షణ సామర్థ్యాలను పెంచుతోన్న విషయం తెలిసిందే. బంకర్ల నిర్మాణం, యూఏవీలు, కమ్యూనికేషన్‌ టవర్ల ఏర్పాటుకు సహకారం అందిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు