Published : 26 May 2022 01:13 IST

Karti Chidambaram: కార్తి చిదంబరానికి మరో షాక్‌.. వీసా కుంభకోణం కేసులో ఈడీ కేసు!

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తిపై కేసుల ఉచ్చు బిగుస్తోంది. లంచం తీసుకొని చైనా దేశస్థులకు వీసా సదుపాయం కల్పించారని ఆరోపణల నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అదే కేసులో ఎన్‌ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సయమంలో 263 మంది చైనీయులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ తాజాగా కేసు పెట్టింది.

వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరంను సీబీఐ విచారించనుంది. విచారణలో పాల్గొనాల్సిందిగా గతంలో సమన్లు జారీ చేసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే, బుధవారం ఉదయం కార్తీ చిదంబరం తరపు న్యాయవాది సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. న్యాయవాదిని విచారించాల్సిన అవసరం లేదని, కార్తీ చిదంబరమే స్వయంగా రావాలని చెప్పి పంపినట్లు సమాచారం.

సుమారు రూ. 50 లక్షలు తీసుకుని.. చైనాకు చెందిన 250 మందికి కార్తీ చిదంబరం వీసాలు ఇప్పించారన్నది ప్రధాన ఆరోపణ. కార్తీ తండ్రి పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగిందని సీబీఐ వెల్లడించింది. దీనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. చిదంబరం సన్నిహితుడు, ఈ కేసుతో సంబంధం ఉన్న ​భాస్కర రామన్​ను గత వారం అదుపులోకి తీసుకుంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని