Cardiac arrest: ఎయిర్‌పోర్టులో వ్యక్తికి గుండెపోటు.. CISF జవాన్ల చర్యకు ప్రశంసలు

చెన్నై విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడికి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.....

Published : 27 Sep 2022 18:56 IST

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడికి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడే భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు సీపీఆర్‌ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఈ నెల 25న సీఐఎస్‌ఎఫ్‌ ట్విటర్‌లో పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తక్షణమే స్పందించి ఆ ప్రయాణికుడిని కాపాడిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

వివరాల్లోకి వెళ్తే.. దుర్గాపూర్‌కు చెందిన శేఖర్‌ హజ్రా అనే వ్యక్తికి ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో అచేతన స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన భద్రతా సిబ్బంది సీపీఆర్‌ చేసి ప్రాణాల్ని కాపాడారు. అతడి పల్స్‌ రేటు మెరుగు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో సీపీఆర్‌ చేసి అతడి ప్రాణాల్ని కాపాడిన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లను నెటిజన్లు అభినందిస్తున్నారు.గొప్ప మానవత్వం ప్రదర్శించిన ఈ సిబ్బందికి సెల్యూట్‌ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని