POK: మా ప్రాంతాన్ని భారత్‌లో కలిపేయండి.. 12 రోజులుగా నిరసనలు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతవాసులు  భగ్గుమంటున్నారు. దశాబ్దాలుగా తమ ప్రాంతాలను దోచుకుంటున్న పాక్‌ సర్కారు దమననీతిపై మండిపడుతున్నారు.

Updated : 14 Jan 2023 08:42 IST

ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్‌  బాల్టిస్థాన్‌ వాసుల డిమాండ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతవాసులు  భగ్గుమంటున్నారు. దశాబ్దాలుగా తమ ప్రాంతాలను దోచుకుంటున్న పాక్‌ సర్కారు దమననీతిపై మండిపడుతున్నారు. తమను భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కార్గిల్‌ రోడ్డును తిరిగి తెరవాలని, భారత్‌లో కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో తమ ప్రాంతాన్ని కలిపేయాలని వారు అడుగుతున్నారు. ఆ ప్రాంతంలో 12 రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. గోధుమ, ఇతర నిత్యావసర వస్తువులపై సబ్సిడీల పునరుద్ధరించాలని, ఈ ప్రాంతంలోని సహజవనరుల దోపిడీ, భూముల ఆక్రమణను ఆపాలని వారు నినదించారు. గిల్గిత్‌ ప్రజలపై పాక్‌ సైనిక అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని