మరో మహత్తర క్రతువులో భాగమయ్యాం: పూరి

కరోనా వైరస్‌ను తరిమికొట్టే తుది అంకానికి భారత్ సంసిద్ధమవుతోంది. తొలిదశ టీకా రవాణాలో భాగంగా టీకా డోసులు దేశంలోని పలు నగరాలు చేరుకుంటున్నాయి.

Published : 12 Jan 2021 12:44 IST

తొలిరోజు 56.5 లక్షల డోసుల రవాణా

దిల్లీ: కరోనా వైరస్‌ను తరిమికొట్టే తుది అంకానికి భారత్ సంసిద్ధమవుతోంది. తొలిదశ టీకా రవాణాలో భాగంగా టీకా డోసులు దేశంలోని పలు నగరాలకు చేరుకుంటున్నాయి. ఈ మహత్తర క్రతువులో విమానయాన శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ట్విటర్ వేదికగా స్పందించారు. తొలిరోజు తొమ్మిది విమానాల్లో 56.5లక్షలో డోసులను పలు నగరాలకు పంపిస్తున్నామని తెలిపారు.

‘పౌర విమానయాన రంగం మరో ముఖ్యమైన మిషన్‌ను ప్రారంభించింది. టీకా రవాణా ప్రారంభమైంది. ఎయిరిండియా, స్పైస్‌జెట్, గోఎయిర్, ఇండిగోకు చెందిన తొమ్మిది విమానాల్లో మొదటి రోజు 56.5లక్షల డోసులను సరఫరా చేస్తున్నాం. పుణె నుంచి దిల్లీ, చెన్నై, కోల్‌కతా, గువహటి, షిల్లాంగ్, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, పట్నా, బెంగళూరు, లఖ్‌నవూ, చండీగఢ్‌‌కు ఈ టీకా డోసులు చేరనున్నాయి’ అని మంత్రి ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటికే టీకా డోసులు పుణె నుంచి దేశ రాజధాని నగరం దిల్లీ, అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. 

ఇవీ చదవండి:

కరోనా కేసుల్లో భారీ తగ్గుదల 

బయలు దేరిన కరోనా టీకా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని