UPSC: సివిల్స్‌ (మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదల

అఖిల భారత సర్వీసుల్లోకి ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ మెయిన్‌‌-2021.....

Updated : 31 Mar 2022 16:01 IST

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ మెయిన్‌‌-2021 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సీ గురువారం విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు 1,823 మంది అర్హత సాధించారు. మెయిన్‌ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్‌ 5 నుంచి ఇంటర్వ్యూలు దిల్లీలో ప్రారంభం కానున్నాయి. దేశంలో ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్, తదితర అఖిల భారత సర్వీసులకు ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఏటా సివిల్స్‌ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంటుంది. ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూ దశల్లో ఉద్యోగుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని