CJI: మా ప్రతిపాదనలు ఆమోదించారు.. ధన్యవాదాలు: సీజేఐ ఎన్‌.వి.రమణ

దేశ రాజధానిలో జరిగిన ముఖ్యమంత్రులు, సీజేల సదస్సులో పలు తీర్మానాలు ఆమోదించినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి .....

Published : 30 Apr 2022 18:08 IST

దిల్లీ: దేశ రాజధానిలో రెండు రోజుల పాటు జరిగిన ముఖ్యమంత్రులు, సీజేల సదస్సులో పలు తీర్మానాలు ఆమోదించినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించాలనే తీర్మానానికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. శనివారం సాయంత్రం ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజుతో కలిసి దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘సీఎంలు, సీజేల సదస్సులో న్యాయమూర్తుల నియామకంపైనా విస్తృతంగా చర్చించాం. విశ్రాంత న్యాయమూర్తుల బెనిఫిట్స్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేయాలి. ఆన్‌లైన్‌ పోర్టల్‌పై న్యాయశాఖ మంత్రితో చర్చించాం. కోర్టుల అనుసంధానం.. తక్షణం పరిష్కరించాల్సిన అంశం. కోర్టుల నెట్‌వర్క్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి సహకరించాలి. మా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు’’ అన్నారు.

మరోవైపు, ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి వేగంగా సిఫార్సులు పంపాలని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు నిన్న పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కోర్టు సముదాయాల్లో ఐటీ మౌలిక వసతులను మరింతగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తుచేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం ప్రారంభమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సును ప్రారంభించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే ఈ సమావేశం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు